మునగపాక : స్థానిక సంస్థల ఎన్నికలు ఎపుడూ జరిగినా వైఎస్సార్‌సీపీ జెండాలు గ్రామాల్లో ఎగురవేసేలా పాటుపడాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ఽఅధికార ప్రతినిధి ఆడారి జన్మదినం సందర్భంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఇచ్చిన పదవులకు వన్నె తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అందేవని, నేడు అటువంటి పరిస్థితులు కనిపించడం లేదని అన్నారు. ఏ పథకం ఎపుడు వస్తుందో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కూటమికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. అలాగే గ్రామాల్లో జరుగుతున్న సర్ కార్యక్రమంలో బీఎల్‌ఏలు చురుగ్గా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు మద్దాల వీరునాయుడు, ఇల్లా శిరీషా నాగేశ్వరరావు, బొడ్డేడ బుజ్జి, మాజీ ఎంపీటీసీ పెంటకోట అప్పలనాయుడు, మాజీ సర్పంచ్‌లు ఇందల హేమలత నాయుడు, చదరం నాయుడు, కర్రి పెదబ్బాయి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ పెంటకోట హరేరామ పాల్గొన్నారు.


