కుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో ఐదుగురికి గాయాలు

Jul 1 2026 1:52 AM | Updated on Jul 1 2026 1:52 AM

గొలుగొండ: స్థానిక పీహెచ్‌సీ పరిధిలో మంగళవారం కుక్కల దాడిలో ఐదుగురు గాయపడ్డారు. చిన్నయ్యపాలెం, జోగుంపేట గ్రామాలకు చెందిన రాజు, నూకరత్నం, తలుపులతో పాటు మరో ఇద్దరిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరికి గొలుగొండ పీహెచ్‌సీలో చికిత్స చేసినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. గడిచిన వారం రోజుల్లో మండలంలో చీడిగుమ్మల, కృష్ణదేవిపేట, గొలుగొండ పీహెచ్‌సీల పరిధిలో కుక్కలదాడిలో 22 మంది గాయపడ్డారు.

పశువులు మృతి

మాకవరపాలెం: మండలంలోని జి.కోడూరు కుక్కల సంచారం అధికమై ఇటీవల పశువులు, మనుషులపై దాడులు చేస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. వీటి దాడిలో వేగి రాఘవేంద్రరావు, బొడ్డేటి పరిదేశినాయుడు, నగిశెట్టి రమణ, కర్రి గోవింద, కొండా సాయిబాబాకు చెందిన పాడి రైతుల పశువులు మృతి చెందాయని మంగళవారం తెలిపారు. మరికొన్ని గాయపడ్డాయన్నారు. వేగి రామునాయుడు, మళ్ల గోవిందలు కూడా కుక్కల దాడిలో గాయపడ్డారన్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement