న్యూస్‌రీల్
కళాకారులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి
అంతస్తులు..
శరవేగంగా పనులు
● రెండు భూగర్భ బేస్‌మెంట్‌లు పూర్తయ్యాయి.
● గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేశారు.
● ప్రస్తుతం మొదటి అంతస్తు పనులు కొనసాగుతున్నాయి.
● అప్రోచ్ రోడ్డు పూర్తయింది.
● ప్రహరీ గోడ నిర్మాణం సుమారు 60 శాతం పూర్తయింది.
ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.121.58 కోట్లను ఆమోదించగా, ఇప్పటికే రూ.42.14 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మరో ఏడాదిలో నిర్మాణం పూర్తి చేసే దిశగా అధికారులు పనులను వేగవంతం చేస్తున్నారు.
మంగళవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2026
సాక్షి, విశాఖపట్నం: ఇది కేవలం ఒక కార్యాలయ భవనం కాదు.. భారతీయ రైల్వే పరిపాలనకు కొత్త గుర్తింపు. ఇది కేవలం పది అంతస్తుల నిర్మాణం కాదు.. భవిష్యత్ రైల్వే కార్యాలయాల రూపురేఖలకు నమూనా. ఇది కేవలం సిమెంట్, స్టీల్‌తో నిర్మిస్తున్న కట్టడం కాదు.. సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగుల సౌకర్యం, శక్తి పొదుపు, ఆధునిక వాస్తుశిల్పం అన్నింటినీ ఒకే వేదికపై కలిపిన విజన్. ముడసర్లోవలో 52 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం దేశంలోనే అత్యంత ఆధునిక రైల్వే అడ్మినిస్ట్రేషన్ కాంప్లెక్స్‌లలో ఒకటిగా అవతరించబోతోంది. భారతీయ రైల్వే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా నిర్మించే రైల్వే పరిపాలన భవనాలకు రోల్‌మోడల్‌గా నిలవనుంది.
ప్రతి అంతస్తుకూ ప్రత్యేక రూపకల్పన
ఈ భవనానికి మొదటి చూపులోనే ప్రత్యేకత కనిపిస్తుంది. రెండు భూగర్భ బేస్‌మెంట్‌లపై పది అంతస్తుల టవర్‌గా నిర్మిస్తున్న ఈ కార్యాలయంలో ప్రతి అంతస్తును ప్రత్యేకమైన ఆర్కిటెక్చరల్ డిజైన్‌తో రూపొందిస్తున్నారు. మధ్యలో భారీ ఫ్రేమ్డ్ వాల్యూమ్.. ఇరువైపులా మెట్ల ఆకృతిలో పైకి ఎదిగే స్టెప్‌డ్ బ్లాక్స్.. మొత్తం భవనానికి ప్రత్యేకమైన శిల్ప సౌందర్యాన్ని తీసుకొస్తాయి. పగటి సమయంలో సహజ కాంతి భవనం అంతటా విస్తరించేలా డిజైన్ చేయడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గనుంది. అదే సమయంలో నగర స్కైలైన్‌లో ఈ భవనం ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోనుంది.
ఐజీబీసీ ప్రమాణాలతో గ్రీన్ క్యాంపస్
ఈ ప్రధాన కార్యాలయం పూర్తిగా పర్యావరణ హిత నిర్మాణంగా రూపుదిద్దుకుంటోంది. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం సాగుతోంది. భవనంపై సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలు, వ్యర్థ జలాల శుద్ధి కేంద్రం, పునర్వినియోగ సదుపాయాలు, నీటిని ఆదా చేసే ప్లంబింగ్ ఫిక్చర్లు, ఇంధన సామర్థ్యం అధికంగా ఉండే ఎలక్ట్రికల్ వ్యవస్థలు ఇందులో భాగం కానున్నాయి. భవిష్యత్ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఎలా ఉండాలో చెప్పేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.
ఉద్యోగులకు మరింత సౌకర్యం
సంప్రదాయ ప్రభుత్వ కార్యాలయాల తరహాలో మూసపద్ధతి గదులు కాకుండా విశాలమైన ఓపెన్ వర్క్‌స్పేస్‌లను రూపొందిస్తున్నారు. ఉద్యోగుల మధ్య సమన్వయం పెరిగేలా కార్యాలయ విభాగాలను అనుసంధానిస్తున్నారు. సందర్శకులు సులభంగా సేవలు పొందేందుకు ప్రత్యేక పబ్లిక్ ఇంటర్‌ఫేస్ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు. విశాలమైన పార్కింగ్, వాహనాలు–పాదచారులకు వేర్వేరు సర్క్యులేషన్ మార్గాలు, ల్యాండ్‌స్కేప్ బఫర్ జోన్లు, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలు, అందమైన ఉద్యానవనాలు, మైక్రో కై ్లమేట్ వాటర్ ఎలిమెంట్స్ ఈ క్యాంపస్‌కు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి.
భారతీయ రైల్వేకు ల్యాండ్ మార్క్‌గా..
నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అన్ని పనులు పూర్తయిన తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం దేశంలోనే అత్యంత ఆధునిక రైల్వే పరిపాలనా సముదాయాల్లో ఒకటిగా నిలుస్తుంది. భవిష్యత్ రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇది రోల్‌మోడల్‌గా మారుతుంది.
–సందీప్ మాథుర్, జనరల్ మేనేజర్, దక్షిణ కోస్తా రైల్వే జోన్
ప్రతిష్టాత్మక వేడుకకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, మహారాణిపేట: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖ పర్యటన నేపథ్యంలో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సోమవారం పరిశీలించారు. శాఖల మధ్య సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి అనితతోపాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తదితర ఉన్నతాధికారులు నోవాటెల్ హోటల్, వి–కన్వెన్షన్ హాలులోని ప్రధాన కార్యక్రమ వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకావడం రాష్ట్రానికి గర్వకారణమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ప్రతి అంశాన్ని అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీసీపీలు లతామాధురి, మణికంఠ, ఆర్డీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ భవన నిర్మాణ నమూనా
చురుగ్గా సాగుతున్న నిర్మాణ పనులు
రూ.121.58 కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ అత్యాధునిక ప్రధాన కార్యాలయం ఇప్పటివరకు రూ.42.14 కోట్ల నిర్మాణ పనులు పూర్తి దేశానికే ఆదర్శంగా ఆధునిక రైల్వే అడ్మినిస్ట్రేషన్ కాంప్లెక్స్
ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను సకాలంలో చెల్లించండి
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ పరిధిలోని ఆస్తి యజమానులు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి అర్థ సంవత్సర ఆస్తిపన్నును ఈ నెల 30లోగా తప్పనిసరిగా చెల్లించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విజ్ఞప్తి చేశారు. గడువులోగా పన్ను చెల్లించడం ద్వారా వడ్డీ భారం నుంచి మినహాయింపు పొందవచ్చని తెలిపారు. అలాగే జీవీఎంసీకి చెల్లించాల్సిన ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, మంచినీటి కుళాయి చార్జీలను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.
విశాఖలో రూపుదిద్దుకుంటున్న భారతీయ రైల్వే భవిష్యత్తు ముఖచిత్రం
వేడి కాదు.. వెలుగు మాత్రమే లోపలికి..
ఈ భవనంలో అత్యంత ప్రత్యేకత థర్మల్ కంఫర్ట్. విశాఖలాంటి తేమ అధికంగా ఉండే వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని డీప్ వర్టికల్ ఫిన్స్, రీసెస్డ్ గ్లేజింగ్, ఇంటిగ్రేటెడ్ షేడింగ్ సిస్టమ్స్‌ను వినియోగిస్తున్నారు. దీంతో సూర్యరశ్మి నుంచి వచ్చే వేడి భవనంలోకి చేరకుండా అడ్డుకట్ట పడుతుంది. అదే సమయంలో సహజ కాంతి మాత్రం సమృద్ధిగా లోపలికి ప్రవేశిస్తుంది. ఫలితంగా ఎయిర్ కండిషనింగ్‌పై ఆధారపడటం తగ్గి విద్యుత్ వినియోగం గణనీయంగా ఆదా అవుతుంది. ఉద్యోగులకు ఆహ్లాదకరమైన పని వాతావరణం ఏర్పడుతుంది.
10


