ఈవీఎం గొడౌన్‌ తనిఖీ చేసిన జేసీ | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గొడౌన్‌ తనిఖీ చేసిన జేసీ

Jun 30 2026 12:19 AM | Updated on Jun 30 2026 12:19 AM

రాజకీయ పార్టీల నేతలతో కలిసి ఈవీఎం గొడౌన్‌ తనిఖీ చేసిన జేసీ శౌర్యమాన్‌ పటేల్‌

తుమ్మపాల : ఈవీఎం గొడౌన్‌ వద్ద సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌ సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గొడౌన్‌ను తనిఖీల్లో భాగంగా సోమవారం రెవిన్యూ డివిజనల్‌ అధికారి ఆయేషాతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన తనిఖీ చేసి, సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాళాలు తీయించి గొడౌన్‌ లోపల భాగంలో కూడా పర్యటించారు. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ప్రమాణాలపై అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. తనిఖీ క్రమంలో లాగ్‌బుక్‌లో సంతకం చేశారు. భద్రతా ప్రమాణాలు, లాగ్‌ బుక్‌ నిర్వహణ ఇతర అంశాలపై నేతలతో మాట్లాడారు. భద్రపరిచిన ఈవీఎంల స్థితిగతులను ఎన్నికల విభాగం అధికారులు వివరించారు కార్యక్రమంలో ఎలక్షన్‌ సెల్‌ సూపరెండెంట్‌ వాసు నాయుడు, నాయకులు బి.నివాసరావు, కె..హరినాథ్‌ బాబు, డి.వేణుగోపాలకృష్ణ , స్థానిక రెవెన్యూ, ఎలక్షన్‌ సెల్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement