అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌కు 62 అర్జీలు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఎస్పీ తుహిన్ సిన్హాకు తెలియజేశారు. అర్జీదారుల సమస్యలను తెలుసుకుని వారం రోజుల్లో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిఽధిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని దిగువ స్థాయి పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. 62 ఆర్జీలు భూ తగాదాలు, ఆస్తి గొడవలు, ఆర్థిక మోసాలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల వేధింపులు, గృహ కలహాలు, శాంతిభద్రతలు, ఇతర సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదపు ఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


