విద్యార్థి దుర్గా ప్రసాద్‌ను సత్కరిస్తున్న యూత్ హాస్టల్ అసోసియేషన్, లయన్స్ క్లబ్
ప్రతినిధులు రాఘవేంద్రరావు, గోపాలరావు
నర్సీపట్నం : ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించిన గొలుగొండ మండలం, జోగంపేట హైస్కూల్‌కు చెందిన విద్యార్థి రావి దుర్గాప్రసాద్‌ను నర్సీపట్నం యూత్ హాస్టల్ అడ్‌హాక్ కమిటీ, లయన్స్‌క్లబ్ వారు సోమవారం ఘనంగా సత్కరించారు. లయన్స్‌క్లబ్ పూర్వపు జిల్లా గవర్నర్, యూత్ హాస్టల్ చీఫ్ డి.రాఘవేంద్రరావు, అధికారి గోపాలరావు విద్యార్థికి జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించి విద్యార్థి చరిత్ర సృష్టించాడని అఽతిథులు కొనియాడారు. కార్యక్రమంలో యూత్ హాస్టల్ అసోసియేషన్ కన్వీనర్ పాలపర్తి సత్యానందం, లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు ఎం.రఘురామ్, సెక్రటరీ టి.రామారావు, ట్రెజరర్ శర్మ పాల్గొన్నారు.


