నక్కపల్లి : దైవ దర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో వివాహిత మృత్యువాత పడిన ఘటన సోమవారం జరిగింది. సీఐ జె.మురళి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెందుర్తికి చెందిన ఓలపల్లి ఈశ్వరరావు తన భార్య గాయత్రి (26)తో కలసి మోటారు సైకిల్‌పై సోమవారం ఉదయం అన్నవరం సత్యదేవుని దర్శనానికి బయలుదేరారు. నక్కపల్లి దాటాక న్యాయంపూడి వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను అనకాపల్లి నుంచి తుని వైపు వెళ్తున్న ఐషర్ వ్యాన్ ఢీకొట్టి ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల మధ్య బైక్ ఇరుక్కుపోయింది. స్కూటీ వెనుక కూర్చొన్న గాయత్రి ఐషర్ వ్యాన్‌లో చిక్కుకుపోయి అక్కడికక్కడే మరణించింది. బైక్ డ్రైవింగ్ చేస్తున్న ఈశ్వరరావుకు స్పల్ప గాయలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


