అంతర్జాతీయ స్థాయి యోగా పోటీల్లో మన ఛాంపియన్లు | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్థాయి యోగా పోటీల్లో మన ఛాంపియన్లు

May 20 2026 1:40 AM | Updated on May 20 2026 1:40 AM

పాయకరావుపేట : శ్రీ ప్రకాష్‌ విద్యార్థి బండారు దేవాన్ష్‌ నాయుడు (10 వ తరగతి) ఈ నెల 16 నుండి 18 వరకు మలేషియాలోని కౌలాలంపూర్‌ వేదికగా జరిగిన 11 వ ప్రపంచ యోగా పోటీల్లో ట్రెడిషనల్‌ యోగాలో ప్రథమ స్థానం, ఆర్టిస్టిక్‌ యోగాలో ప్రథమ స్థానం పొంది ఛాంపియన్‌ ఆఫ్‌ ది ఛాంపియన్స్‌ టైటిల్‌ సాధించినట్టు విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్‌.విజయ్‌ ప్రకాష్‌ తెలిపారు. ట్రెడిషనల్‌ విభాగంలో మొత్తం 13 దేశాల నుంచి 31 మంది విద్యార్థులు, ఆర్టిస్టిక్‌ విభాగంలో 13 మంది పోటీపడగా వాటిలో దేవా న్ష్‌ నాయుడు ప్రథమ స్థానం సాధించి, అన్ని విభాగాల్లో ప్రథమ స్థానం సాధించిన 10 మందితో పోటీపడి ఛాంపియన్‌ ఆఫ్‌ ది ఛాంపియన్స్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నట్టు వివరించారు. ఇంతటి ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యా సంస్థల అధినేత నరసింహారావు, సీనియర్‌ ప్రిన్సిపాల్‌ మూర్తి, ప్రిన్సిపాల్‌ రవి కుమ్మమూరు, యోగా గురువులు సురేష్‌, జయంతి అభినందనలు తెలిపారు.

యోగాలో చోడవరం విద్యార్థి ప్రతిభ

చోడవరం : అంతర్జాతీయ స్థాయి యోగాసనాల పోటీల్లో చోడవరానికి చెందిన ముత్యాల దైవజ్ఞ ద్వితీయస్థానం సాధించాడు. ఈనెల 16నుంచి 19వ తేదీ వరకూ మలేషియా రాజధాని కౌలాలంపూర్లో 11వ ప్రపంచస్థాయి యోగాసన పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో చోడవరంలో పతంజలి యోగా కేంద్రంలో శిక్షణ పొందుతున్న గాంధీగ్రామానికి చెందిన ముత్యాల దైవజ్ఞ 6–10 సంవత్సరాల విభాగంలో పాల్గొన్నాడు. యోగ నిద్ర ఆసనం, కుక్కుటా సనం, టిట్టిబాసనం, గండభేరుండ ఆసనం వంటి అతి క్లిష్టమైన ఆసనాలు వేసి పోటీలో తన దైన ప్రతిభను కనబరిచాడు. దైవజ్ఞను చోడవరంలో అన్ని సంఘాలు, ప్రజలు అభినందించాయి.

పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన దైవజ్ఞ

ఛాంపియన్‌ ఆఫ్‌ ది ఛాంపియన్‌ సాధించిన విద్యార్థి బండారు దేవాన్ష్‌ నాయుడు

Advertisement
 
Advertisement
Advertisement