ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల ప్రైవేటీకరణ ఆపాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో విద్యుత్‌ బస్సుల ప్రైవేటీకరణ ఆపాలి

May 19 2026 12:40 AM | Updated on May 19 2026 12:40 AM

విద్యుత్‌ బస్సులను ఆర్టీసీ ద్వారానే నడపాలని, ప్రైవేటీకరణ అంశాన్ని ఆపాలని, సీ్త్ర శక్తి పథకం ద్వారా పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్సుల సంఖ్య పెంచాలని, నూతన ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసి ఉద్యోగులను భర్తీ చేయాలంటూ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్‌ డీఎన్‌ మూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలను ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేయాలన్నారు. పదవీ విరమణ, మరణించిన ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏపీజేఏసీ జిల్లా చైర్మన్‌ వాసు, జిల్లా ఎంప్లాయిస్‌ యూనియన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వై.వి.ఎస్‌. కుమార్‌, డిపో కమిటీ ట్రెజరర్‌ పి.సతీష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement