మునగపాక: అనారోగ్యంతో బాధపడుతూ గడ్డి మందు తాగిన మహిళ సోమవారం మృతి చెందినట్టు ఎస్‌ఐ పి.ప్రసాదరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. తిమ్మరాజుపేటకు చెందిన దొడ్డి వనజ (47) కొంత కాలంగా అనారోగ్య సమస్యతో మానసిక ఆవేదనకు గురై ఈ నెల 17న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్థానికులు ఆమెను అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి చెల్లెలు బొడ్డేడ విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వనజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్టు ఎస్‌ఐ తెలిపారు.


