కేజీహెచ్‌లో హిమోగ్లోబినోపతి కేర్‌ సెంటర్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కేజీహెచ్‌లో హిమోగ్లోబినోపతి కేర్‌ సెంటర్‌ ప్రారంభం

May 19 2026 12:28 AM | Updated on May 19 2026 12:28 AM

మహారాణిపేట: గిరిజన ప్రాంతాల్లోని సికల్‌ సెల్‌ ఎనీమియా, తలసేమియా వంటి జన్యుపరమైన రక్తహీనత వ్యాధుల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని రాష్ట్ర గిరిజన, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొ న్నారు. సోమవారం కేజీహెచ్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ. 3.77 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన హిమోగ్లోబినోపతి–కాంప్రహెన్సివ్‌ కేర్‌ సెంటర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా నవజాత శిశువులకు పుట్టిన 24 గంటలకే రక్త పరీక్షలు చేసే విధానాన్ని కేజీహెచ్‌లోనే ప్రారంభించామ న్నారు. దీనివల్ల చిన్న వయసులోనే వ్యాధిని గుర్తించి ప్రాణనష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. కేజీహెచ్‌కు వచ్చే గిరిజన రోగుల మార్గదర్శకత్వం కోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక ‘ఎస్టీ సెల్‌’ ఏర్పాటు చేశామని, అవసరమైన వారికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. సికల్‌ సెల్‌ ఎనీమియా జన్యుపరమైనదని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement