తుమ్మపాల: పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి వచ్చే అర్జీదారులు ఆయుష్’ ఉచిత హోమియో వైద్య శిబిరం ద్వారా ఉచితంగా పరీక్షలు చేయించుకుని మందులు పొందవచ్చని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ’ఆయుష్’ ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని ఆమె సందర్శించి పలు సూచనలు చేశారు. ప్రతి సోమవారం ప్రజలకు అందుబాటులో ఆయుర్వేదం, హోమియోపతి సేవలు అందించడం జరుగుతుందన్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందుల పంపిణీతో పాటు బీపీ చెక్‌అప్, మోకాళ్ల నొప్పులు, ఆయాసం, దగ్గు, నీరసం, ఎసిడిటీ, మధుమేహం, వంటి వ్యాధులకు మందులు, సన్ స్ట్రోక్‌కు ప్రివెంటివ్ మందులు పంపిణీ చేసినట్టు రోగులను తనిఖీ చేయడానికి హోమియోపతి మెడికల్ అధికారిని కూడా నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ డాక్టర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


