జెట్టీ.. క్రెడిట్‌ చోరీ | - | Sakshi
Sakshi News home page

జెట్టీ.. క్రెడిట్‌ చోరీ

Jan 19 2026 4:25 AM | Updated on Jan 19 2026 4:25 AM

జెట్ట

జెట్టీ.. క్రెడిట్‌ చోరీ

గత ప్రభుత్వ హయాంలో చేసిన ప్రతిపాదనలు

జెట్టీ నిర్మించ తలపెట్టిన బోయపాడు తీరం

నక్కపల్లి: గంగ పుత్రుల కష్టాలు తీర్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఫిష్‌ లాండింగ్‌ సెంటర్లను(జెట్టీ) చంద్రబాబు ప్రభు త్వం తమ ఖాతాలో వేసుకుంది. జెట్టీ మంజూరులో క్రెడిట్‌ చోరీకి పాల్పడింది. పాయకరావుపేట నియోజకవర్గం రాజయ్యపేటలో జెట్టీ నిర్మాణానికి 2023లో రూ.24.77 కోట్లు మంజూరు చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థలపరిశీలన కూడా పూర్తయింది. ఢిల్లీనుంచి నేషనల్‌ ఓషనోగ్రఫీకి చెందిన ప్రత్యేక బృందం, శాస్త్రవేత్తల బృందం వచ్చి సర్వే చేసి ఇక్కడ జెట్టీ నిర్మాణానికి అన్ని అనుకూలమని నివేదిక సమర్పించారు. దొండవాక, రాజయ్యపేట సరిహద్దుల్లో ఈ జెట్టీ నిర్మాణానికి దాదాపు అన్ని అనుమతులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో జెట్టీ నిర్మాణంలో జాప్యం జరిగింది. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం రాజయ్యపేటలో జెట్టీ మంజూరు చేస్తున్నట్లు మరో మోసపూరిత ప్రకటన విడుదల చేయడంపై సర్వత్రావిమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో మత్స్యకారులు ఆ పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారీ వారికి అన్యాయమే జరుగుతోంది. గత నాలుగు దశాబ్దాలలో ఒక్కసారి కూడా గంగ పుత్రులను పట్టించుకున్న దాఖలాలు లేవు. తాజాగా 2024లో అధికారం చేపట్టిన తర్వాత కూడా గత ప్రభుత్వం మంజూరు చేసిన జెట్టీ నిర్మాణాన్ని మొదలు పెట్టకుండా మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌పై మొగ్గు చూపించింది. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటరు నిర్మించడం మానేసి మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయోజనాల కోసం కార్గోపోర్టు నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయడంతో పాటు, ఆగమేఘాల మీద భూములు కేటాయించింది. పాయకరావుపేట నియోజకవర్గంలో 17 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు 25 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వీరిలో దాదాపు 10వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా చేపల వేటపై ఆధారపడ్డారు. ప్రాణాలకు తెగించి వీరు వేటాడి తెచ్చిన మత్స్య సంపద నిల్వ చేసుకోవడం, భద్రపరచుకోవడం, మార్కెటింగ్‌ చేసుకోడానికి సరైన సదుపాయాలు లేవు. లక్షలాది రూపాయల విలువైన మత్స్యసంపదను వేటాడి తెచ్చుకుంటున్నప్పటికీ మార్కెటింగ్‌ చేసుకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజా సంకల్పపాదయాత్రలో మత్స్యకారులు సమస్యలు స్వయంగా తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పాయకరావుపేట నియోజకవర్గానికి ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత 2023లో నక్కపల్లి మండలం రాజయ్యపేట, బోయపాడు సమీపంలో మినీ జెట్టీ(ఫిష్‌ ల్యాండింగ్‌సెంటరు) ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారు. ఈ జెట్టీ నిర్మాణానికి మొత్తం రూ.24.77 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కేంద్రం తన వాటాకింద రూ.14.86 కోట్లు కేటాయించగా రాష్ట్రప్రభుత్వ వాటాకింద రూ.9.90కోట్లు మంజూరు చేసింది. ఈ జెట్టీ నిర్మాణానికి అవసరమైన పదెకరాల స్థలాన్ని రాజయ్యపేట, బోయపాడు, దొండవాక ప్రాంతాల్లో ఎంపిక చేశారు. రిజర్వ్‌ ఫారెస్టుకు చెందిన స్థలం కావడంతో వారికి ప్రత్యామ్నాయంగా పదెకరాలను కేటాయించి, జెట్టీ నిర్మించాలనేది గత ప్రభుత్వ నిర్ణయం.జెట్టీ నిర్మాణానికి గుర్తించిన భూములను ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణులు, రాష్ట్ర, జిల్లా మత్స్యశాఖ ఉన్నతాధికారులు పరిశీలించి అనువైన ప్రాంతంగా నివేదిక ఇవ్వడంతో నిర్మాణానికి గత ప్రభుత్వం జీవో జారీ చేసింది.

సాంకేతిక సమస్యలతో జాప్యం

భూసేకరణలో ఎదురైన సాంకేతిక ఇబ్బందుల వల్ల జెట్టీ నిర్మాణం ఆలస్యమైంది. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఎన్నికల కోడ్‌ కారణంగా నిర్మాణం నిలిచిపోయింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మిట్టల్‌స్టీల్‌ ప్లాంట్‌వారు నిర్మించే క్యాప్టివ్‌పోర్టుకు 148 ఎకరాలు కేటాయించేసింది. మత్స్యకారులనుంచి విమర్శలు రావడం, బల్క్‌డ్రగ్‌పార్క్‌ను వ్యతిరేకిస్తూ రెండు నెలలపాటు ఆందోళన చేయడంలో ఇప్పుడు కంటితుడుపు చర్యగా ఆగమేఘాలపై తాజాగా వారం రోజుల క్రితం రాజయ్యపేటలో జెట్టీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం పట్ల పలువురు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలోనే జెట్టీ మంజూరైతే ఇప్పుడు కొత్తగా ప్రకటనలు చేయడమేమిటని మత్స్యకారులు పెదవి విరుస్తున్నారు.

నిస్సిగ్గుగా ..

గత ప్రభుత్వ హయాంలో 2023లో అప్పటి ఎమ్మెల్యే గొల్లబాబూరావు ద్వారా నియోజకవర్గానికి జెట్టీ మంజూరు చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రూ.24 కోట్లతో జెట్టీ మంజూరు చేసి, నిధులు కేటాయింపునకు జీవో ఇచ్చారు. ఎన్నికల కారణంగా నిర్మాణంలో జాప్యం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు మరో జీవో ఇచ్చి, జెట్టీ మంజూరు చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఒక్క అభివృద్ధి పనీ చేయకపోగా గత ప్రభుత్వంలోమంజూరు చేసిన వాటిని తమ ఖాతాలో వేసుకోవడం, ప్రారంభోత్సవాలు,శంకుస్థాపనలు చేసుకోవడం దారుణం.

– వీసం రామకృష్ణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్రకార్యదర్శి

గత ప్రభుత్వ హయాంలోనే జెట్టీ మంజూరు

జగనన్న ప్రభుత్వం మా మత్స్యకారుల కోసం జెట్టీ మంజూరు చేసింది. డబ్బులుకూడా విడుదల చేసింది. పదెకరాల భూమికూడా కేటాయించారు.టెండర్లు పూర్తయి జెట్టీ కడతారనుకునే సమయంలో ఎన్నికలు వచ్చాయి, జెట్టీ ఆగిపోయింది. అధికారంలోకి వచ్చిన చంద్రప్రభుత్వం జెట్టీకట్టక పోగా స్టీల్‌ప్లాంట్‌ కోసం పోర్టుకు స్థలం కేటాయించింది. మత్స్యకారులంతా ఆగ్రహంతో ఉన్నారని ఇప్పుడు జెట్టీ మంజూరు చేశారు.40 ఏళ్లుగా పట్టించుకోలేదు కానీ, ఇప్పుడు మంజూరు చేయడం విడ్డూరంగా ఉంది.

– మైలపల్లి సూరిబాబు, మత్స్యకారుడు రాజయ్యపేట

రూ.2.32 కోట్లు వెచ్చించి జెట్టీ, ఇతర భవనాలు నిర్మించాలి.

రూ.33 లక్షల వ్యయంతో పచ్చదనం, మొక్కల పెంపకం చేపట్టాలి.

రూ.34 లక్షలతో వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం.

రూ.1.86 కోట్లతో చేపలను ఎండ బెట్టేందుకు 2 ప్లాట్‌ఫారాల నిర్మాణం.

రూ.15లక్షల వ్యయంతో ట్రక్‌ పార్కింగ్‌ స్థలం ఏర్పాటు.

రూ.21లక్షల వ్యయంతో మత్స్య సంపద కోసం లోడింగ్‌ సెంటరు(షెడ్లు) నిర్మాణం.

రూ.1.11 కోట్ల వ్యయంతో చేపల క్రయవిక్రయాల కోసం ప్రత్యేకంగా పెద్దపెద్ద హాళ్ల నిర్మాణం.

రూ.5.94 లక్షలతో ఫిష్‌ ల్యాండింగ్‌ ప్లాట్‌ ఫారాలు.

రూ.32.24 లక్షలతో బీచ్‌ ల్యాండింగ్‌ ప్లాట్‌ ఫారం.

రూ.7.11కోట్ల వ్యయంతో జెట్టీ వద్ద మెకనైజ్డ్‌, మోటారు బోట్లు, ఇంజిన్లు, తెప్పల మరమ్మతుల కోసం ప్రత్యేక భవనాలు, షెడ్ల నిర్మాణం.

రూ.1.98 కోట్లతో సిమెంటు రోడ్లు.

రూ.64లక్షల వ్యయంతో డ్రైనేజీలు.

రూ.1.14కోట్ల వ్యయంతో ప్రహరీ.

రూ.9.88లక్షల వ్యయంతో వ్యర్థజలాలను శుద్ధి చేసే ప్లాంటు ఏర్పాటు.

రూ.46.92 లక్షల వ్యయంతో వలల మరమ్మతులు, భద్రపరచుకునే షెడ్లు.

రూ.39.42లక్షల వ్యయంతో విశ్రాంతి భవనాలు.

రూ.10లక్షల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణం.

రూ.27.22 లక్షల వ్యయంతో తాగునీరు, వాడుకనీరు కోసం ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

జెట్టీ నిర్మించే ప్రాంతం చుట్టూ బయోఫెన్సింగ్‌,పటిష్టమైన రక్షణ గేటుకోసం రూ.9.16 లక్షలు కేటాయించారు.

బోర్లు, గొట్టపు బావులు, మోటార్లు భూస్టర్‌క్లీనింగ్‌ సదుపాయాల కల్పనకు రూ.16 లక్షలు, విద్యుత్‌సదుపాయం, ట్రాన్స్‌ఫార్మర్లు, వీధి దీపాల కోసం రూ.80.85 లక్షలు, విద్యుత్‌ సరఫరా, కనెక్షన్‌లకోసం రూ.80లక్షలు కేటాయించారు.ముందస్తు అధ్యయనాల కోసం రూ.20 లక్షలు, అత్యవసర పరిస్థితుల్లో ఖర్చు చేసేందుకు రూ.60 లక్షలు కేటాయించారు.

తమది కాని మరో క్రెడిట్‌ను ఖాతాలో

వేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం

జెట్టీ మంజూరు చేస్తున్నట్టు తాజాగా ప్రకటన

గత ప్రభుత్వలోనే రూ.24 కోట్లు

కేటాయింపు, జీవో విడుదల

జెట్టీ.. క్రెడిట్‌ చోరీ1
1/3

జెట్టీ.. క్రెడిట్‌ చోరీ

జెట్టీ.. క్రెడిట్‌ చోరీ2
2/3

జెట్టీ.. క్రెడిట్‌ చోరీ

జెట్టీ.. క్రెడిట్‌ చోరీ3
3/3

జెట్టీ.. క్రెడిట్‌ చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement