జూదాల నిర్వాహకుల అరెస్టు
మోసయ్యపేటలో నెంబర్ పట్టాతో పోలీసులు పట్టుకున్న గుళ్లాట నిందితులు
కశింకోట: మండలంలోని రెండు గ్రామాల్లో కోడి పందాలు, గుల్లాటలకు నిర్వహిసుండగా ఆదివారం ఆకస్మికంగా దాడి చేసి నలుగుర్ని పట్టుకొని అరెస్టు చేశామని సీఐ అల్లు స్వామినాయుడు తెలిపారు. ఈ సందర్భంగా రెండు పందెం కోళ్లు, రూ.1260 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. పాత కన్నూరుపాలెం శివారులో కోడి పందాలు నిర్వహిస్తుండగా ఇద్దరు నిందితులను పట్టుకొని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.540 నగదు, రెండు పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మోసయ్యపేటలో గుళ్లాట నిర్వహిస్తుండగా ఇద్దరు నిందితుల్ని పట్టుకొని నెంబరు పట్టా, రూ.720 నగదు స్వాధీనం చేసుకొని చట్ట పరమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఎస్‌ఐ లక్ష్మణరావు, సిబ్బంది దాడులు నిర్వహించి పట్టుకున్నారన్నారు.


