చురుగ్గా పనిచేసేవారికి పార్టీ కమిటీల్లో స్థానం
మునగపాక: పార్టీ కోసం పనిచేసిన చురుకై న వారిని కమిటీల్లో నియమించాలని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ సూచించారు. బొడ్డేడ క్యాంపు కార్యాలయంలో పార్టీ మండల క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసే కమిటీల్లో చురుగ్గా పనిచేసే వారికి అవకాశం కల్పించేలా చూడాలన్నారు. కమిటీల ఏర్పాటు ద్వారా పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. అన్ని అనుబంధ సంఘాల కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని,తద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్య ర్థులు విజయం సాధించే అవకాశం ఉంటుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. ప్రజలంతా మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు అద్యక్షతన జరిగిన సమావేశంలో క్లస్టర్ ఇన్‌చార్జిలు నరాలశెట్టి సూర్యనారాయణ,సుందరపు తాతాజీ, ఆడారి త్రి మూర్తులు,బొడ్డేడ శ్రీనివాసరావు,పెంటకోట హరేరామ,కాండ్రేగుల కిరణ్‌కుమార్,బొద్దపు శ్రీరామమూర్తి,మొల్లేటి శంకర్,కాండ్రేగుల జగన్ పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో
వైఎస్సార్‌సీపీ గెలుపే లక్ష్యం
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమేలక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తెలిపారు. మునగపాక పంచాయతీ పరిధిలో పలు విభాగాలకు నూతనంగా నియమితులైన కార్యవర్గ సభ్యులను ఆయన అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్‌తో కలిసి ఆదివారం బొడ్డేడ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరో సారి సీఎంను చేయాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. కష్టపడి పనిచేసేవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ,మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, పార్టీ నేతలు అప్పారావు,సత్యనారాయణ,లక్ష్మణరావు,కాశీబాబు,రామ్మోహనరావు పాల్గొన్నారు. గ్రామ శాఖ అధ్యక్షునిగా మళ్ల రామజగన్నాథం,యువజన విభాగం అధ్యక్షునిగా పెంటకోట సారథి, రైతు విభాగం అధ్యక్షుడిగా పెంటకోట ఆదిశివ,బీసీ సెల్ విభాగం అధ్యక్షుడిగా వెలగా రామకృష్ణ నియమితులయ్యారు.
వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్
చురుగ్గా పనిచేసేవారికి పార్టీ కమిటీల్లో స్థానం


