అశ్వవాహనంపై స్వామివారికి తిరువీధి సేవలు
అశ్వవాహనంపై స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహిస్తున్న అర్చకులు
నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక వేంకటేశ్వరస్వామివారికి శనివారం అశ్వవాహనంపై తిరువీధి సేవలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి విశేష పూజలు, నిత్యార్చనలు జరిపారు. అనంతరం కొండదిగువన ఉత్సవమూర్తులకు వేణుగోపాలస్వామివారికి, గోదాదేవి అమ్మవారికి నిత్యపూజలు చేశారు. అనంతరం అశ్వవాహనంపై శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని అశ్వవాహనంపైన, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధి సేవలు నిర్వహించారు. అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 24వ పాశురాన్ని విన్నపం చేశారు. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా రాత్రిపల్లకిలో స్వామివారికి తిరువీధి సేవలు నిర్వహించారు. అధ్యాపక స్వామి ద్రవిడ వేదప్రబంధం విన్నపం చేశారు. తదుపరి ప్రసాదవి నివేదన, తీర్థగోష్టి,ప్రసాద వినియోగం జరిగాయి.ఈ కార్యక్రమాల్లో అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, శేషాచార్యులు, సాయి ఆచార్యులు, దేవస్థానం అధికారులు కూర్మేశ్వరరావు పాల్గొన్నారు.


