అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు లభించడం హర్షణీయం
సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శత సంవత్సరాల వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి,పాడేరు: అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు లభించడం సంతోషంగా ఉందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అన్నారు.కర్నాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లా కేంద్రంలో 1925లో ఏర్పాటు చేసిన సెంట్రల్ కాఫీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శత సంవత్సరాల వేడుకలు సోమవారం ఘఽనంగా జరిగాయి.ఈకార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గిరిజన రైతులు సాగు చేస్తున్న నాణ్యమైన కాఫీ గింజలు, వాటి నాణ్యతను వివరించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీపడేలా మరింత నాణ్యమైన కాఫీ ఉత్పత్తులను సాధించడమే లక్ష్యంగా గిరిజన రైతులు కృషి చేస్తున్నారని తెలిపారు. గ్లోబల్ బ్రాండింగ్‌లో అరకు కాఫీని మరింతగా ప్రమోట్ చేసి విదేశాలకు ఎగుమతులను ప్రోత్సహించనున్నట్టు ఆయన చెప్పారు.


