నూకాంబికకు పూజలు
నూకాంబిక అమ్మవారిని
దర్శించుకుంటున్న భక్తులు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని ఆదివారం పలు ప్రాంతాల భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మార్గశిర మాసం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉద్యోగులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అంతకుముందు రాష్ట్ర తూర్పుకాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


