ప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాటం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాటం

Dec 15 2025 8:50 AM | Updated on Dec 15 2025 8:50 AM

ప్రభు

ప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాటం

మునగపాక: యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించేలా ప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లి డివిజన్‌లోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ వారం రోజులుగా మునగపాకలో రైతులతో కలిసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా మునగపాక మెయిన్‌రోడ్డులో పార్టీ శ్రేణులతో కలిసి మానవహారం నిర్వహించారు. సోమవారం నుంచి రోజుకో పంచాయతీలో రైతులతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టేందుకు నిర్ణయించారు. అనంతరం మహానేత రాజన్న విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్‌, భరత్‌కుమార్‌ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భరత్‌కుమార్‌ మాట్లాడుతూ అనకాపల్లి డివిజన్‌లోనే యలమంచిలి నియోజకవర్గాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. నక్కపల్లి డివిజన్‌లో యలమంచిలి నియోజవర్గాన్ని కలపకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సుదూర ప్రాంతమైన నక్కపల్లికి వెళ్లాలంటే ఈ ప్రాంత ప్రజలకు కష్టతరమవుతుందని చెప్పారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా స్థానిక ప్రజా ప్రతినిధులు పునరాలోచించి గతంలో వలే యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లిలో కొనసాగించేలా చూడాలన్నారు. వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ వారం రోజులుగా రైతులు,ప్రజలతో కలిసి నిరసన తెలుపుతున్నా ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా అనకాపల్లి డివిజన్‌లోనే యలమంచిలి నియోజకవర్గం ఉండేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు పరిపాలన చేరువ చేయాల్సిన ప్రజా ప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 1491ను సవరించేవరకు రాజీలేని పోరాటం తప్పదన్నారు. ఏడవ రోజున నాగులాపల్లి, రాజుపేట,కాకరాపల్లి,అరబుపాలెం గ్రామాలకు చెందిన పార్టీ నేతలు, రైతులు,ప్రజలు దీక్షలో కూర్చొన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ ఆడారి అచ్చియ్యనాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్ష,కార్యదర్శులు కాండ్రేగుల నూకరాజు, సుందరపు తాతాజీ,సర్పంచ్‌లు బొడ్డేడ శ్రీనివాసరావు,కర్రి పెదబ్బాయి,దిమ్మల అప్పారావు,ఆడారి త్రిమూర్తులు.ఎంపీటీసీలు సూరిశెట్టి రాము,బొడ్డేడ బుజ్జి, మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు,శరగడం అప్పలనరసమ్మ,మళ్ల కాశీ సురేష్‌, పార్టీ నేతలు దాసరి అప్పారావు, షేక్‌ ఇస్మాయిల్‌, పిల్లి అప్పారావు,ఆడారి కాశీబాబు,గుంట్ల అప్పారావు, పెంటకోట అప్పలనాయుడు,పిట్టా మంగారెడ్డి, రాపేటి పరమేష్‌, దొడ్డి వరహా, మళ్ల సుధాకర్‌, దొడ్డి బుజ్జి, కాండ్రేగుల జగన్‌, లంబా అప్పారావు, నరాలశెట్టి సూర్యనారాయణ, మళ్ల ఉమామహేశ్వరరావు, మందా రాము, ధనశ్రీను తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి నేతల సంఘీభావం

మునగపాకలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు ఆదివారం అనకాపల్లి నియోజకవర్గం నేతలు సంఘీభావం తెలిపారు. ఎంపీపీ గొర్లి సూరిబాబు, జెడ్పీటీసీ శ్రీధర్‌,మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్‌ మలసాల కిషోర్‌,యువజన విభాగం నాయకుడు జాజుల రమే ష్‌, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, కె.ఎం. నాయుడు,మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పద్మ తదితరులు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.

వైఎస్సార్‌సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త భరత్‌కుమార్‌

ముగిసిన రిలే నిరాహార దీక్షలు

ఆఖరి రోజు మునగపాకలో

మానవహారం

నేటి నుంచి రోజుకో గ్రామంలో

కొవ్వొత్తుల ప్రదర్శన

ప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాటం1
1/1

ప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాటం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement