కిక్కిరిసిన బొజ్జన్నకొండ
బొజ్జన్నకొండకు పోటెత్తిన
విద్యార్థులు, సందర్శకులు
తుమ్మపాల: జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణానికి సమీపంలో శంకరం గ్రామంలో ఉన్న ప్రసిద్ధ బొజ్జన్నకొండ ఆదివారం సందర్శకులతో కిక్కిరిసిపోయింది. గుహలు, బౌద్ధ స్థూపం, చైత్యాలు, పురాతన కట్టడాలను తిలకించిన పలువురు మంత్రముగ్ధులయ్యారు. జిల్లాలో పలు పాఠశాలల విద్యార్థులు ఇక్కడికి వనసమారాధనకు తరలి వచ్చారు. బొజ్జన్నకొండతో పాటు లింగాల కొండను సందర్శించి , సాయంత్రం వరకు ఆట పాటలతో సందడి చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులకు మౌలిక సౌకర్యాలు లేక పలు ఇబ్బందులు పడ్డారు. నిబంధనల పేరుతో కొండ పరిసరాల్లో సందర్శకులు, విద్యార్థుల వనసమారాధనకు సిబ్బంది అడ్డంకులు సృష్టిస్తున్నారని పలువురు వాపోయారు.


