జీవీఎంసీకి ప్రతిష్టాత్మక పీఆర్‌ఎస్ జాతీయ అవార్డులు
అవార్డులు అందుకుంటున్న జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి,
పీఆర్వో నాగేశ్వరరావు
డాబాగార్డెన్స్: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్–2025లో జీవీఎంసీ మూడు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను సాధించింది. ఈ విషయాన్ని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ‘ఎంపవరింగ్ గ్రోత్, ప్రిజర్వింగ్ రూట్స్, పీఆర్ విజన్ ఫర్ 2047’ అనే థీమ్‌తో జరిగిన ఈ సదస్సులో జీవీఎంసీ అమలు చేసిన ప్రజా సంక్షేమం, మహిళా సాధికారత, ఆర్థిక బలోపేతం, సామాజికాభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించింది. ఉత్తరాంఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, శాసనసభ స్పీకర్ రీతూ ఖండూరీ భూషణ్ చేతుల మీదుగా జీవీఎంసీ తరఫున అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, పౌర సంబంధాల అధికారి ఎన్. నాగేశ్వరరావు అవార్డులు అందుకున్నారు.


