బాబు సర్కార్‌ను రైతులు నమ్మడం లేదు
అన్నదాత సుఖీభవ కింద ఏటా రూ.20 వేలు ఇస్తామని కూటమి నాయకులు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది రెండు విడతల్లో రూ.10 వేలు వేశారు. యూరియా సకాలంలో లేకపోవడంతో ప్రైవేటు షాప్‌లలో అధిక ధరలో యూరియా కొనుగోలు చేయవలసి వచ్చింది. సకాలంలో యూరియా వేయకపోవడంతో వరి పంటకు తెగుళ్లు రావడంతో నాలుగుసార్లు స్ప్రేయింగ్ చేశాము. దీని వలన భారీగా పెట్టుబడి పెరుగుపోయింది. ఇప్పడు గ్రామాల్లో రైతన్నా మీ కోసం అంటూ రైతు సేవా కేంద్రాల వద్ద కరపత్రాలు పంపిణీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎన్ని కరపత్రాలు పంపిణీ చేసినా కూటమి ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో రైతులు లేరు.
–పొట్నూరి వెంకట సత్యనారాయణ, రైతు, మత్స్యవానిపాలెం, రావికమతం మండలం


