విగ్రహాలపై అక్కసు | - | Sakshi
Sakshi News home page

విగ్రహాలపై అక్కసు

Mar 22 2026 1:48 AM | Updated on Mar 22 2026 1:48 AM

కొనసాగుతున్న కూటమి నేతల ‘అరాచక’ పర్వం

ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్‌ విగ్రహాలపై దాడులు

వైఎస్సార్‌ లాన్‌, వ్యూ పాయింట్‌ వద్ద ధ్వంసరచన

తాజాగా గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి

తీవ్రంగా స్పందించిన వైఎస్సార్‌సీపీ

48 గంటల్లో దోషులను శిక్షించాలని డిమాండ్‌

పేరు వింటే

వణుకు

అనకాపల్లి మండలం తగరంపూడిలో గుడివాడ గురునాథరావు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగలు

ఇటీవల పెందుర్తిలో వైఎస్సార్‌ విగ్రహాన్ని తొలగిస్తున్న దృశ్యం

మ్మడి విశాఖ జిల్లాలో విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరుతో ఉన్న విగ్రహాలు, స్థలాలు లక్ష్యంగా మారడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. వైఎస్సార్‌ పేరు వినగానే కూటమి నేతల్లో అసహనం వ్యక్తమవుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజల గుండెల్లో చెరిగిపోని ఆ మహానేత జ్ఞాపకాలను ఇలా చెరిపేయాలని ప్రయత్నించడం దురుద్దేశపూరితమని ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ఈ ఆందోళనలకు బలం చేకూరుస్తున్నాయి. ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌లో అధికారికంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ లాన్‌ బోర్డును తొలగించడం మొదలుకుని, జీవీఎంసీ తీర్మానంతో ఏర్పాటైన వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌ వద్ద పేరు చెరిపే ప్రయత్నాలు చోటుచేసుకున్నాయి. అక్కడితో ఆగకుండా, పెందుర్తి వద్ద రోడ్డు విస్తరణ పేరుతో వైఎస్సార్‌ విగ్రహాన్ని తొలగించే యత్నం జరిగింది. స్థానిక నేతల ప్రతిఘటనతో ఆ ప్రయత్నం విఫలమైంది. తాజాగా అనకాపల్లి మండలం తగరంపూడిలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తండ్రి గుడివాడ గురునాథరావు విగ్రహంపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనతో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది.

పోలీసుల మౌనాన్ని ఆసరాగా చేసుకుని సాగుతున్న ఈ రాక్షసకాండపై వైఎస్సార్‌సీపీ గర్జించింది. 48 గంటల్లో నిందితులను పట్టుకోకుంటే జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తామని ‘అల్టిమేటం’ జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement