స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలిన | - | Sakshi
Sakshi News home page

స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన ఏర్పాట్ల పరిశీలిన

Mar 22 2026 1:48 AM | Updated on Mar 22 2026 1:48 AM

● ఐజీ గోపీనాథ్‌ జట్టి

నూకాంబిక ఆలయం వద్ద ప్రత్యేక బందోబస్తు

నక్కపల్లి: మండలంలోని చందనాడ పంచాయతీలో ఈనెల 23న జరిగే ఆర్సిలర్‌మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన ఏర్పాట్లను హోంమంత్రి అనిత, కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌,ఎస్పీ తుహిన్‌సిన్హాలు శనివారం పరిశీలించారు. చందనాడ సమీపంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంతోపాటు, సీఎం చంద్రబాబు పాల్గొనే బహిరంగ సభ వేదిక ఏర్పాట్లు పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ తుహిన్‌సిన్హా వివరించారు. మంత్రి,కలెక్టర్‌లు మాట్లాడుతూ సీఎం,డిప్యూటీ సీఎం, ఐటీశాఖల మంత్రి పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. సభకు హాజరయ్యేవారికోసం ప్రత్యేక పార్కింగ్‌ ప్రాంతాలను ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్‌ జామ్‌కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

పేటకు గుర్తింపు

ఆర్సిలర్‌ మిట్టల్‌ నిప్పన్‌ ఇండియా వారు నిర్మిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ ద్వారా పాయకరావుపేట నియోజకవర్గానికి ప్రపంచ స్థాయిగుర్తింపు లభిస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు రూ.1.37లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు. సుమారు 60 వేల మందికి ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement