ఆర్‌కే బీచ్‌ వద్ద నటి కాజల్‌ సందడి | - | Sakshi
Sakshi News home page

ఆర్‌కే బీచ్‌ వద్ద నటి కాజల్‌ సందడి

Mar 22 2026 1:48 AM | Updated on Mar 22 2026 1:48 AM

కొమ్మాది: ఆర్‌కె బీచ్‌ సమీపంలోని హవా మహల్‌ వద్ద శనివారం సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. ప్రముఖ దర్శకుడు సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఈ చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శనివారం జరిగిన షూటింగ్‌లో కాజల్‌ అగర్వాల్‌తో పాటు ప్రముఖ నటులు అజయ్‌ ఘోష్‌, అజయ్‌లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. తమ అభిమాన నటిని చూ సేందుకు స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో హవా మహల్‌ పరిసర ప్రాంతాలు కోలాహలంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement