జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, హైస్కూల్ హెచ్‌ఎంలతో కలెక్టర్ సమావేశం
అనకాపల్లి టౌన్: త్వరలో జరగబోయే ఇంటర్, పదో తరగతి పరీక్ష ఫలితాలలో జిల్లా శతశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. స్థానిక వర్తక సంఘం ఆదినారాయణ ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా జూనియర్ కళాశాలలు, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారు ఉత్తీర్ణులయ్యేలా తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ నెల 5న జరిగే మెగా తల్లిద్రండుల సమావేశం ఒక పండగ వాతావరణంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు, ఇంటర్మీడియట్ అధికారి వినోద్ బాబు, యలమంచిలి ఉప విద్యాధికారి పొన్నాడ అప్పారావు, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కో ఆర్డినేటర్ మేరీగ్రేస్ పాల్గొన్నారు.


