మాట్లాడుతున్న సహాయ కార్మికాధికారి సూర్యనారాయణ
చోడవరం: కార్మికులకు అన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని కార్మిక శాఖ సహాయ కార్మికాధికారి పి. సూర్యనారాయణ అన్నా రు. బుధవారం చోడవరంలో సబ్బవరం, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ, బుచ్చెయ్య పేట, రావికమతం, మాడుగుల మండలాలకు చెందిన కార్మిక సంఘాలతో ఆయన సమావేశమయ్యారు. గత నెల నుంచి సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరించామ న్నారు. కార్మికుల కుమార్తెల వివాహానికి రూ.40 వేలు, ప్రసూతి ఖర్చులకు రూ. 20వేలు, సహజ మరణానికి రూ.60వేలు, దహన ఖర్చులకు రూ. 20వేలు ఇచ్చే పథకాలు పునరుద్ధరించామన్నారు.


