హోంగార్డు కుటుంబానికి రూ.4.24 లక్షల సాయం | - | Sakshi
Sakshi News home page

హోంగార్డు కుటుంబానికి రూ.4.24 లక్షల సాయం

Apr 2 2026 7:53 AM | Updated on Apr 2 2026 7:53 AM

హోంగార్డు వెంకటరావు భార్య నీలిమకు చెక్కు అందజేస్తున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి: పోలీస్‌ శాఖలో హోంగార్డులు ఒక భాగమేనని ఎస్పీ తుహిన్‌ సిన్హా తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు డి.వి.వెంకటరావు భార్య నీలిమకు రూ.4,24,120 చెక్కును బుధవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఆర్‌.ఐ.ఎన్‌.ఎల్‌ స్టీల్‌ ప్లాంట్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తిస్తూ, అనారోగ్యంతో మరణించిన వెంకటరావు కుటుంబానికి అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మిగిలిన హోంగార్డులు ఒక రోజు గౌరవ వేతనాన్ని అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎ.ఓ సి.హెచ్‌.తిలక్‌ బాబు, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ దేవరాజు, జూనియర్‌ అసిస్టెంట్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement