గోవాడ ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు
చోడవరం: కార్మికులను నష్టం కలిగించే లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో గోవాడ సుగర్‌ఫ్యాక్టరీ గేటు వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా సీఐటీయు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపు ఇవ్వడంతో దీనిలో భాగంగా గోవాడ ఫ్యాక్టరీ వద్ద కార్మికులు ధర్నా చేశారు. లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను నష్టం కలిగించే చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందని, వెంటనే వీటిని రద్దు చేయాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు, గోవాడ సుగర్స్ కార్మిక సంఘం నాయకులు శరగడం రామునాయుడు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాల వల్ల గోవాడ సుగర్ ప్యాక్టరీలో కార్మికులు, రైతులకు తీరని నష్టం కలిగిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణంలో రైతులు, కార్మికులకు రావలసిన బకాయిలను చెలించాలని వారు డిమాండ్‌చేశారు. ఈ ఆందోళనలో నాయకులు ఎస్.వి నాయుడు, రాయి సూరిబాబు, రామకుమార్ పాల్గొన్నారు.


