మెగా జాబ్ మేళాలో 151 మందికి ఉద్యోగాలు
యలమంచిలి రూరల్: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యలమంచిలి గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. 18 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించగా 151 మందిని వివిధ ఉద్యోగాలను ఎంపిక చేసినట్టు ప్లేస్‌మెంట్ అధికారి పప్పల శ్రీనివాసరావు తెలిపారు. జాబ్ మేళాను ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ ప్రారంభించారు. నిరుద్యోగులు ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సీఐ ధనుంజయరావు మాట్లాడుతూ యువత బాగా చదువుకొని స్థిరపడాలన్నారు. సైబర్ క్రైమ్, గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా వంటి సమాజ రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ఇ.సందీప్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి నీలం గోవిందరావు, ఎంపీడీవో కొండలరావు, సీఐ ధనుంజయరావు, పట్టణ ఎస్సై కె.సావిత్రి పాల్గొన్నారు.


