యూపీఎస్సీ కోచింగ్ స్క్రీనింగ్ టెస్ట్‌కు 436 మంది హాజర
ఆరిలోవ: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మూడు అంబేడ్కర్ స్టడీ సర్కిల్స్‌లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు కోచింగ్ ఇవ్వనున్నారు. ఈ కోచింగ్ కోసం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు, గురుకులాల జిల్లా సమన్వయాధికారి జి. గ్రేస్ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకృష్ణాపురం గురుకులంలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు మొత్తం 955 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా వారిలో 436 మంది హాజరైనట్లు సమన్వయాధికారి గ్రేస్ తెలిపారు. హాజరైన వారిలో 247 మంది పురుషులు కాగా 189 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. స్క్రీనింగ్ పరీక్ష అబ్జర్వర్ సురేష్‌కుమార్ పర్యవేక్షణలో అభ్యర్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.


