తుఫాన్ ప్రభావిత ప్రాంతాలనుపరిశీలించిన మంత్రి రవీంద్ర
చోడవరం: తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం పరిశీలించారు. మోంథా తుఫాను కారణంగా చోడవరం మండలంలో పలు ప్రాంతాల్లో పంటలు మునిగిపోయాయి. వరదల్లో దెబ్బతిన్న రాయపురాజుపేట గెడ్డపై కాజ్‌వేలను, భోగాపురంలో కోతకు గురైన శారదానది గట్టును మంత్రి పరిశీలించారు. వీటి మరమ్మతులకు చర్యలు చేపడతానని, తుఫాన్ నష్టాలను సీఎం దృష్టికి తీసుకెళతానని ఆయన చెప్పారు. పంట నష్టంపై వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించామని, పంటనష్టం నమోదు చేస్తామని చెప్పా రు.ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.


