‘కాశీబుగ్గ’ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత లేదు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో కూటమి డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్సార్‌సీపీ పార్లమెంట్, అసెంబ్లీ
కాశీబుగ్గ మృతుల ఆత్మకు శాంతి కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ
అనకాపల్లి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో తొమ్మిది మంది మరణించగా, పలువురు క్షతగాత్రులయ్యారని, మృతుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు బొడ్డేడ ప్రసాద్, మలసాల భరత్‌కుమార్ డిమాండ్ చేశారు. పోలీస్, ఇంటెలిన్‌జెన్స్ వ్యవస్థలను పటిష్టపరచడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మృతులకు నివాళులర్పిస్తూ స్థానిక రింగ్‌రోడ్డు వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ రహదారి(భీమునిగుమ్మం) అంబేడ్కర్ విగ్రహం వరకూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి, మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత కరవైందన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టులు చేయించేందుకే పోలీస్, ఇంటెలి జెన్స్ వ్యవస్థలను ప్రభుత్వం వినియోగిస్తోందని విమర్శించారు. తిరుపతి, సింహాచలం వంటి పుణ్యక్షేత్రాల్లో జరిగిన సంఘటనలు మరువకముందే కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ పాలనలో పోలీస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థలను పటిష్టం చేసి రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. చంద్రబాబు పాలనలో ప్రతిసారీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాటాలు చేస్తే వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై కక్షపూరితంగా కేసులు పెట్టి, అరెస్టులు చేయడంఅన్యాయమని, రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. హిందువుల దేవాలయాలపై కూటమి నేతలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తిరుపతి, సింహాచలం, కాశీబుగ్గ ఘటనలు రుజువుచేస్తున్నాయని చెప్పారు. తిరుపతిలో సంఘటన జరిగిన తరువాత ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. తిరుపతి ఘటనలో బాధిత కుటుంబాలకు నేటికీ నష్టపరిహారం అందజేయలేదన్నారు. కల్తీమద్యం రాష్ట్రంలో ఏరులైపారుతున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకుండా పోయిందన్నారు. కల్తీమద్యం తయారీలో ప్రభుత్వ పెద్దల హస్తం ఉన్నట్టు ప్రజలకు స్పష్టంగా అర్థమైందని చెప్పారు. దీనిపై ప్రశ్నించిన మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు జోగి రమేష్‌ను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. నకిలీ మద్యంపై సీబీఐ దర్యాప్తుకు కూటమి నాయకులు భయపడుతున్నారని విమర్శించారు. డైవర్షన్ రాజ కీయాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
రేపు కోటి సంతకాల సేకరణ
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 4న అనకాపల్లి నెహ్రూచౌక్ వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ సతీమణి నివేదిత, పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్‌రాజు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, అనకాపల్లి, కశింకోట మండలా అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్, మార్కెట్‌కమిటీ మాజీచైర్మన్ గొల్లవిల్లి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బొడ్డేడ ప్రసా ద్, పి.డి.గాంధీ, కుండల రామకృష్ణ, బాధపు హరికృష్ణ, మునూరు శ్రీనివాసరావు, కాండ్రేగుల హైమావతి, శోభ, లక్ష్మి, కోన ఉమా పాల్గొన్నారు.
నియోజకవర్గాల సమన్వయకర్తలు
బొడ్డేడ పసాద్, భరత్‌కుమార్
‘కాశీబుగ్గ’ మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి


