
చౌడువాడ, కొత్తకోట డాక్టర్లకు కలెక్టర్ అభినందన
వైద్యులను అభినందిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: స్వచ్ఛాధ్ర–స్వర్ణాంధ్ర పోటీల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి పొందిన చౌడువాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జిల్లా స్థాయిలో ప్రథమబహుమతి పొందిన కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు కె.మాలంనాయుడు, కె.ఎం.సురేఖలను బుధవారం కలెక్టర్ విజయకృష్ణన్ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ హైమావతికి సూచించారు.