స్వచ్ఛత మెరిసి.. చౌడువాడ మురిసి | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛత మెరిసి.. చౌడువాడ మురిసి

Oct 4 2025 1:45 AM | Updated on Oct 4 2025 1:45 AM

స్వచ్

స్వచ్ఛత మెరిసి.. చౌడువాడ మురిసి

చౌడువాడలోని చెత్త నుంచి సంపద

తయారు చేసే కేంద్రం

కె.కోటపాడు: స్వచ్ఛతతో ఆ గ్రామం మెరిసింది... రాష్ట్రస్థాయిలో అవార్డుకు ఎంపిక కావడంతో ఆ పల్లె మురిసిపోయింది. మండలంలోని మేజర్‌ పంచాయతీ అయిన చౌడువాడ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛ గ్రామ అవార్డుకు ఎంపికై ంది. రాష్ట్రంలో మొత్తం ఆరు గ్రామ పంచాయతీలను స్వచ్ఛ గ్రామ పంచాయతీలకు ఎంపిక చేయగా వీటిలో చౌడువాడ ఒకటి. గ్రామంలో పరిశుభ్రతకు పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది తీసుకుంటున్న చర్యల ఫలితంగా రాష్ట్ర స్థాయిలో ఈ అవార్డు లభించడం పట్ల గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తెల్లతెల్లవారుతుండగానే...

గ్రామ పంచాయతీలో ఆరుగురు క్లాప్‌మిత్రలు విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఉదయం ఆరు గంటలకే గ్రామాల్లో గల ప్రధాన వీధుల్లో చెత్త సేకరణను చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ వీధిలో ఇళ్లకు వెళ్లి వారికి పంచాయతీ అందించిన డస్ట్‌బిన్‌లలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి గ్రామ శివారున గల చెత్త నుంచి సంపద తయారీ కేంద్రానికి తరలిస్తున్నారు. తద్వారా గ్రామంలో గల ప్రధాన వీధుల్లో అపారిశుధ్య సమస్య లేకుండా అధికారులు చర్యలను తీసుకుంటున్నారు. సంపద తయారీ కేంద్రంలో వర్మీ కంపోస్టు ఎరువు తయారు చేస్తూ తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకూ 1,500 కిలోల ఎరువును విక్రయించగా రూ.7,500లు ఆదాయం పంచాయతీకి లభించింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, అట్టపెట్టెలను సేకరించి విక్రయించగా పంచాయతీకి మరో రూ.4వేల ఆదాయం వచ్చింది.

రాష్ట్ర స్థాయి అధికారుల పరిశీలన

చౌడువాడ గ్రామాన్ని గత నెల 19న రాష్ట్ర స్థాయి అధికారులు పరిశీలించారు. వీధుల్లో పారిశుధ్యం, గ్రామస్తులు తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి క్లాప్‌మిత్రలకు అందించే విధానాన్ని గమనించారు.ఇళ్ల పరిసరాల్లో కిచెన్‌గార్డెన్‌ల నిర్వహణను పరిశీలించారు. సంపద తయారీ కేంద్రం నిర్వహణ, పరిశుభ్రత తదితర అంశాలను గుర్తించిన అధికారులు చౌడువాడ గ్రామాన్ని ఉత్తమ స్వచ్ఛ గ్రామంగా ఎంపిక చేశారు.

రోజూ ఇన్‌లైన్‌ క్లోరినేషన్‌

చౌడువాడలో ఎనిమిది తాగునీటి పథకాలున్నాయి. ప్రతి రోజూ పథకాలకు నీరు వచ్చే సమయాల్లోనే ఇన్‌లైన్‌ క్లోరినేషన్‌ కార్యక్రమం జరిగేలా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకున్నారు. తద్వారా స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందిస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒక సారి ఈ తాగునీటి పథకాలను శుభ్రపరుస్తున్నారు. గ్రామంలో 2,400 ఇళ్లు ఉండగా, 7,373 మంది జనాభా నివస్తున్నారు. ఈ ఏడాది 90 శాతం ప్రజలు ఇంటి పన్నులు చెల్లించారు.

బాధ్యత పెరిగింది

రాష్ట్ర స్థాయిలో చౌడువాడ స్వచ్ఛ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. దీంతో పాటు బాధ్యత కూడా పెరిగింది. క్లాప్‌మిత్ర, గ్రీన్‌మిత్ర, పంచాయతీ పాలకవర్గ, గ్రామ పెద్దలు పారిశుధ్యం మెరుగుకు సహకారం అందిస్తున్నారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు ఇన్‌లైన్‌ క్లోరినేషన్‌ జరిగేలా చర్యలు తీసుకున్నాం.

–పి.సురేష్‌బాబు,

పంచాయతీ కార్యదర్శి, చౌడువాడ

ఆనందంగా ఉంది

చౌడువాడ రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ పంచాయతీగా ఎంపిక కావడంలో అందరి సహకారం ఉంది. ఉదయం 6 గంటల నుంచే చెత్త సేకరణ ప్రారంభమవుతుంది. ప్రజలు, పంచాయతీ పాలక వర్గ సభ్యుల సూచనల మేరకు పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ అవార్డును ఈ నెల 6న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్వీకరించనున్నాం.

–దాడి ఎరుకునాయుడు, సర్పంచ్‌, చౌడువాడ

రాష్ట్ర స్థాయిలో

ఉత్తమ స్వచ్ఛ పంచాయతీగా ఎంపిక

ఈ నెల 6న విజయవాడలో అవార్డు

అందుకోనున్న సర్పంచ్‌,

పంచాయతీ కార్యదర్శి

స్వచ్ఛత మెరిసి.. చౌడువాడ మురిసి1
1/3

స్వచ్ఛత మెరిసి.. చౌడువాడ మురిసి

స్వచ్ఛత మెరిసి.. చౌడువాడ మురిసి2
2/3

స్వచ్ఛత మెరిసి.. చౌడువాడ మురిసి

స్వచ్ఛత మెరిసి.. చౌడువాడ మురిసి3
3/3

స్వచ్ఛత మెరిసి.. చౌడువాడ మురిసి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement