
రెండు గ్రామాల్లో వైద్యశిబిరాలు
గొలుగొండ : జ్వరాలతో బాధపడుతున్న విప్పలపాలెం, గాదంపాలెం గ్రామాల్లో ఆదివారం వైద్య శిబిరాలు నిర్వహించి, రక్త పరీక్షలు జరిపి, 38 మందికి మందులు అందజేశారు. ‘జిల్లాకు జ్వరమొచ్చింది’ అనే శీర్షికన ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి, సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెండు గ్రామాల్లో డెంగ్యూ, చికున్ గున్యాతో బాధపడుతూ 80 మంది వరకూ మంచంపట్టారు. జ్వరపీడితలకు వైద్య పరీక్షలు జరపడంతో పాటు గ్రామాల్లో దోమల నివారణకు మందు పిచికారీ చేశారు. మురుగునీరు ఉన్న ప్రాంతాల్లో దోమలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఈవోపీఆర్‌డీ బాబూరావు ‘సాక్షి’కి తెలిపారు.

రెండు గ్రామాల్లో వైద్యశిబిరాలు

రెండు గ్రామాల్లో వైద్యశిబిరాలు