
18 నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
మునగపాక : నాగులాపల్లిలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో రాష్ట్ర స్థాయి మహిళలు, పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు కబడ్డీ ఆసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైంజిగ్ కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. మూడు రోజుల పాటు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పోటీలు జరుగుతాయన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఆయన నాగులాపల్లిలో విలేకరుల సమావేశంలో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే విజయకుమార్ జన్మదినం సందర్భంగా అనకాపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దొడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో చిత్తూరు. గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలకు సంబంధించి మహిళలు, పురుషుల జట్లు పాల్గొంటాయన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పోటీల కన్వీనర్ కె.ఎన్.వి. సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు, టెక్నికల్ కమిటీ సభ్యులు ఎం.గణపతిరావు, కోచ్ శివ, కూటమి నేతలు దాడి ముసిలినాయుడు, టెక్కలి పరశురామ్, నాగేశ్వరరావు, మురళి, రాజేష్ పాల్గొన్నారు.