
ఉత్సాహంగా న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్
అనకాపల్లి టౌన్: స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్యర్యంలో న్యాయవాదుల క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ఉత్సాహంగా జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవాదులను నాలుగు టీములుగా విభజించి ఏఎంఏఎల్ కళాశాల గ్రౌండ్‌లో క్రికెట్ టోర్న మెంట్ నిర్వహించారు. పదోఅదనపు జిల్లా జడ్జి నరేష్, అడిషనల్ సబ్ కోర్ట్ జడ్జి రామకృష్ణ, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ధర్మారావు టోర్నమెంట్‌ను ప్రారంభించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిల్లా హరశ్రీనివాసరావు, కార్యదర్శి బంధం రమణ, ఉపాధ్యక్షుడు సంకర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.