
నూతన పద్ధతులతో అధిక దిగుబడులు
మాకవరపాలెం: కాలానుగుణంగా వస్తున్న నూతన పద్ధతుల్లో రైతులు వ్యవసాయం చేస్తూ అధిక దిగుబడులు సాధించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు. మొదటి విడత అన్నదాత సుఖీభవ పథకం నగదు విడుదల నేపథ్యంలో శనివారం మండల పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో 2,31,000 మంది రైతులకు ఈ పథకం లబ్ధి చేకూరినట్టు చెప్పారు. నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ పాల్గొన్నారు.
అనకాపల్లిలో..
అనకాపల్లి టౌన్: స్ధానిక గుండాల జంక్షన్ వద్ద ఆర్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ’ సమావేశంలో కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొన్నారు. ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ ప్రసంగాలను వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతగా జిల్లాలో ఉన్న 2,42,536 మంది రైతుల ఖాతాల్లో 161.45 కోట్ల రూపాయలు జమ చేస్తున్నట్టు చెప్పారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఆర్డీవో షేక్ అయిషా, జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రావు, అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీష్ తదితరులు పాల్గొన్నారు.
● స్పీకర్ అయ్యన్నపాత్రుడు

నూతన పద్ధతులతో అధిక దిగుబడులు