
చూడి పశువు కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు
● శస్త్రచికిత్స చేసి తొలగించిన పశువైద్యాధికారులు
చూడి పశువుకు శస్త్ర చికిత్స నిర్వహిస్తున్న పశువైద్యాధికారి శివకుమార్
బుచ్చెయ్యపేట: మండలంలో వడ్డాది ఎస్సీ కాలనీ నివాసి కోరుకొండ రాముకు చెందిన చూడి పశువు కడుపులో పెద్ద ఎత్తున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ సంచులను శస్త్ర చికి త్స ద్వారా పశువైద్యాధికారులు తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి రాముకు చెందిన చూడి పశువు 15 రోజులుగా మేత వేయడంలేదు.దీంతో పాటు కడుపు పొంగుతో బాధపడుతోంది. రాము శనివారం వడ్డాది పశువైద్యశాలకు తన పశువును తీసుకెళ్లాడు. బుచ్చెయ్యపేట పశువైద్యాధికారి డాక్టర్ పద్మజ చూడి పశువును పరీక్షించి, శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. కె.జె.పురం ఇన్‌చార్జి పశువైద్యాధికారి శివకుమార్ పశువుకు శస్త్ర చికిత్స నిర్వహించారు. కడుపులోంచి ప్లాస్టిక్ వ్యర్థాలు, పాలిథిన్ సంచులు, ప్లాస్టిక్ తాడులను తొలగించారు. శస్త్ర చికిత్స చేసి పశువు ప్రాణాలు కాపాడిన పశువైద్యాధికారులకు రైతు రాము కృతజ్ఞతలు తెలిపాడు.

చూడి పశువు కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు