
149 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన
జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న నగరప్రజలు
డాబాగార్డెన్స్ (విశాఖ): జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 149వ జయంతి పురస్కరించుకొని నగర వీధుల్లో 149 అడుగుల భారీ జాతీయ జెండాను శనివారం ప్రదర్శించారు. స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పాతనగరం నుంచి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ దరి రాణి బొమ్మ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ముందుగా పింగళి వెంకయ్య చిత్రపటానికి సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ సీఎంఏ జహీర్ అహ్మద్, సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు, పలువురు సంస్థ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్లమెంట్‌లో వెంకయ్య విగ్రహాన్ని ప్రతిష్టించడంతోపాటు భారతరత్న బిరుదు ప్రకటించాలని కోరారు. టి.కృష్ణ, సీహెచ్ నూకరాజు, సీమెన్ భాష పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.