
తాటిచెట్టు ప్రకృతి ప్రసాదించిన కల్పతరువు. ఈ వృక్షంలోని
రంపచోడవరం: అంతరించిపోతున్న తాటి చెట్ల పరిరక్షణకు పందిరిమామిడి డా.వైఎస్సార్ ఉద్యాన పరిశోధనస్థానం (హెచ్‌ఆర్‌ఎస్) శాస్త్రవేత్తలు విశేష కృషి చేస్తున్నారు. అఖిల భారత తాటి సమన్వయ పరిశోధన పథకంలో భాగంగా 1993 నుంచి ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. తాటి చెట్ల నుంచి సేకరించిన నీరాపై జరిపిన పరిశోధనలు అనేక ఆహార ఉత్పత్తుల తయారీకి దోహద పడ్డాయి. తాటి పండ్ల నుంచి వచ్చే గుజ్జుతో మజా తరహాలో తయారుచేసిన పానీయం సోమవారం నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు స్థానిక పరిశోధన స్థానంలో విక్రయించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
● దేశంలో దాదాపుగా 15 కోట్ల తాటి చెట్లు ఉండగా ఒక్క మన రాష్ట్రంలో మూడున్నర కోట్లకు పైగా ఉన్నాయి. ఇక్కడ పరిశోధనల నిమిత్తం 272 రకాల చెట్లు ఉన్నాయి. వీటి నుంచి సేకరించిన నీరాతో తాటి బెల్లం, తేగల నుంచి నూక, బిస్కెట్లు, జెల్లీ వంటి సుమారు 20 రకాల ఆహార పదార్థాలను విజయవంతంగా తయారుచేశారు. తాజాగా తాటి పండు గుజ్జు నుంచి పానీయం (డ్రింక్)ను హెచ్‌ఆర్‌ఎస్ సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డా. పీసీ వెంగయ్య అభివృద్ధి చేశారు. తాటి గుజ్జులో సమపాళ్లలో నీటిని కలిపి మిక్స్ చేయడం ద్వారా ఎనర్జీ డ్రింక్‌ను రూపొందించారు. తాటి చెట్టు నుంచి పండు పడిన మూడు గంటల్లో సేకరించడం ద్వారా ఆరోగ్యవంతమైన గుజ్జును పొందవచ్చని శాస్త్రవేత్త వెంగయ్య తెలిపారు. పానీయం తయారు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సేకరించిన పండ్లను వేడి నీటితో శుభ్రం చేయడం వల్ల పానీయానికి అవసరమైన మంచి గుజ్జును సేకరించవచ్చు.
● ఎక్కువ మొత్తంలో లభించే తాటి గుజ్జును నిల్వ చేయడంపై హెచ్‌ఆర్‌ఎస్‌లో జరుగుతున్న పరిశోధనలు తుది దశకు చేరుకున్నాయి. ఇక్కడి తాటి వనం నుంచి సేకరించిన తాటిపండ్ల గుజ్జును నిల్వ చేసి అధ్యయనం చేస్తున్నారు. రోజురోజుకు మార్కెట్లో తాటి ఆహార ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడడంతో గిరిజనులకు మంచి ఆదాయం వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. తాటిగుజ్జులో పోషక విలువలు ఉన్నాయి. ఐరన్, అధికంగా పోటాషియం, పాస్పరస్, మినరల్స్, విటమిన్ –సీ ఉన్నాయని వారు పేర్కొన్నారు.
ఉత్పత్తుల తయారీలో నిమగ్నమైన గిరి మహిళలు
తాటి నీరాతో ఉత్పత్తుల తయారీపై
విస్తృత పరిశోధనలు
ఇప్పటికే పలు ఆహార ఉత్పత్తులు పరిచయం
తాజాగా పండు గుజ్జుతో పానీయం
అందుబాటులోకి తేనున్న పందిరిమామిడి హెచ్‌ఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు
తాటి చెట్ల సంరక్షణతోపాటు గిరిజనులకు మంచి ఆదాయ వనరు
అందుబాటులోకి పానీయం
తాటి పండు గుజ్జు మంచి పోషకం. దీని ద్వారా తయారు చేసే ఆహార ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని విస్తృత పరిశోధనలు చేస్తున్నాం. ఇప్పటికే చాలా రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చాం. తాజాగా పానీయం (డ్రింక్) కూడా తెస్తున్నాం. తాటి ఆహార ఉత్పత్తుల తయారీపై గిరిజనులకు శిక్షణ ఇచ్చి మంచి ఆదాయం పొందేలా తీర్చిదిద్దుతాం.
–డా. పీసీ వెంగయ్య, ప్రధాన శాస్త్రవేత్త,
పందిరిమామిడి ఉద్యానవన పరిశోధన స్థానం

తాటిచెట్టు ప్రకృతి ప్రసాదించిన కల్పతరువు. ఈ వృక్షంలోని

తాటిచెట్టు ప్రకృతి ప్రసాదించిన కల్పతరువు. ఈ వృక్షంలోని

తాటిచెట్టు ప్రకృతి ప్రసాదించిన కల్పతరువు. ఈ వృక్షంలోని