
డిఫెన్స్ మద్యం స్వాధీనం
డిఫెన్స్ మద్యం బాటిళ్లతో నిందితుడు, పక్కన ఎకై ్సజ్ సిబ్బంది
నర్సీపట్నం: మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెం బస్టాప్ వద్ద డిఫెన్స్ మద్యం తరలిస్తున్న నిందితుడిని శనివారం ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. అదే మండలం వజ్రగడకు చెందిన గాజుల సత్తిబాబు(32) 14 మద్యం సీసాలను వేరే చోట అమ్మేందుకు తీసుకువెళ్తూ పట్టుబట్టాడు. వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు నర్సీపట్నం ఎకై ్సజ్ సీఐ కె.సునీల్ కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ వై.నాగశంకర్, గోవర్ధన్, నారాయణరావు, లావణ్య పాల్గొన్నారు.