
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పింగళి వెంకయ్యకు నివాళి
నర్సీపట్నం: జాతీయ పతాక రూపకర్త స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 149వ జయంతిని శనివారం వైఎస్సార్‌సీపీ నాయకులు నిర్వహించారు. పెదబొడ్డేపల్లి పెద్ద చెరువు వైఎస్సార్ ట్యాంక్ బండ్ వద్ద పింగళి వెంకయ్య విగ్రహానికి మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి భారతీయుడు ఎప్పటికి గర్వించే త్రివర్ణ పతాకాన్ని అందించిన గొప్ప మహనీయుడు పింగళి అని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ మాజీ స్టేట్ డైరెక్టర్ కర్రి శ్రీనువాసరావు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు షేక్ రోజా, పార్టీ నాయకులు పెట్ల అప్పలనాయుడు, యాదగిరి దాసు, కణితి వాసు, శ్రీనువాసరావు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక శాఖ గ్రంథాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రంథాలయ అధికారి పి.దమయంతి పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళుర్పించారు.