నిరసన తెలుపుతున్న పీఆర్‌టీయూ నాయకులు
నర్సీపట్నం: సీనియార్టీ ప్రాతిపదికన ఎంఈవో–1 పోస్టులు భర్తీ చేయాలని పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక పీఆర్‌టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి జిల్లా పరిషత్ హైస్కూల్(మెయిన్) వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయకుండా తక్షణమే ఎంఈవో పోస్టులు భర్తీ చేయాలన్నారు. పీఆర్‌టీయూ నాయకులు అల్లు అప్పారావు, ఊరమణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎ.వరహాలనాయుడు, రమేష్, హెచ్‌ఎం రత్నం పాల్గొన్నారు.
వాల్తేర్ డివిజన్ రన్నింగ్ స్టాఫ్ నిరాహార దీక్ష