
పింఛన్ల పంపిణీ ప్రారంభం
నాతవరం/తుమ్మపాల: జిల్లాలో శుక్రవారం సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నాతవరం మండలం గునుపూడి గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. అనంతరం గునుపూడి హైస్కూల్‌ను సందర్శించి విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు, ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో కె,ఉషాశ్రీ పాల్గొన్నారు.
కలెక్టర్ విజయ కృష్ణన్ అనకాపల్లి మండలం పిసినికాడ గ్రామంలో పలువురు లబ్ధిదారులకు పింఛన్ నగదు అందజేశారు. డీఆర్‌డీఏ పీడీ కె.శచీదేవి, తహసీల్దార్ ఎం.బి.అప్పారావు, డిప్యూటీ ఎంపీడీవో ప్రసాద్, పాల్గొన్నారు.

పింఛన్ల పంపిణీ ప్రారంభం