
స్వాతంత్య్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ విజయ కృష్ణన్
తుమ్మపాల: స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం వివిధ శాఖల జిల్లా అధికారులతో ఏర్పాట్లపై ఆమె సమీక్ష నిర్వహించారు. గత ఏడాది నిర్వహించిన మాదిరిగా పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద ఉన్న ఎన్టీఆర్ మైదానంలో నిర్వహించాలన్నారు. స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను వేడుకలకు ఆహ్వానించి సత్కరించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై స్టాల్సు ఏర్పాటు చేసి శకటాల ప్రదర్శన చేయాలని పేర్కొన్నారు. డీఆర్వో వై.సత్యనారాయణరావు, జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్) ఎల్.మోహన్‌రావు, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు షేక్ ఆయిషా, వివి రమణ, డీఈవో అప్పారావు నాయుడు, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వినోద్‌బాబు, ఫైర్ ఆఫీసర్లు వెంకటరమణ, మనోహర్, డీపీవో సందీప్, డీఎంహెచ్‌వో హైమావతి సమావేశంలో పాల్గొన్నారు.