
స్పీకర్ స్పందించకపోతే నిరసన అమరావతికి..
నర్సీపట్నం: జి.కోడూరు క్వారీపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించకపోతే నిరసన అమరావతికి మారుతుందని విదసం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు పేర్కొన్నారు. మాకవరపాలెం మండలం జి.కోడూరు క్వారీని ఆయన సందర్శించి, ఆర్డీవో కార్యాలయం వద్ద బాధిత దళిత రైతులు చేస్తున్న నిరాహారదీక్ష శిబిరానికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వే నెంబరు 332లో మైనింగ్ కార్యకలాపాలు దళిత రైతుల జీవనాధారాన్ని దెబ్బతిస్తున్నాయన్నారు. స్పీకర్ వెంటనే స్పందించి క్వారీ లీజు రద్దు చేయించాలన్నారు. గతంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ నాయకులు క్వారీని నిర్వహించటం దారుణమన్నారు. మైనింగ్ కార్యక లాపాలకు అనుమతులు ఇచ్చే ముందు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిబంధనల ప్రకారం క్వారీలు వ్యవసాయ భూముల నుంచి కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలన్నారు. కానీ ఇక్కడ 5 మీట ర్ల దూరం కూడా లేదన్నారు. ఈ క్వారీ బ్లాస్టింగ్ వల్ల బూడిద జీడి, మామిడి తోటలపై పడి పంటలకు నష్టం కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బొ ట్టా చిన్ని యాదవ్ నాగరాజు పాల్గొన్నారు.