
నాణ్యమైన విద్యనందించాలి
అనకాపల్లి: విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని నాణ్యమైన విద్యను అందించాలని ఇంటర్మీడియట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మజ్జి ఆదినారాయణ అధ్యాపకులకు సూచించారు. గురువారం స్థానిక మెయిన్‌రోడ్డు ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లాలో వివిధ ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధ్యాపకులు ఉదయం 9లోపు, సాయంత్రం 5 గంటల తర్వాత ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఫేస్ రికగ్నిషన్ యాప్ ద్వారా అటెండెన్స్ తప్పనిసరిగా వేయాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులకు అనుగుణంగా విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు కృషి చేయాలన్నారు. కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. అనంతరం ఇక్కడ కళాశాలలో తరగతుల్లోకి వెళ్లి బోధన విషయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇంటర్మీడియట్ జిల్లా అధికారి మద్దిలి వినోద్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్మీడియట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ మజ్జి ఆదినారాయణ