
బోధనలో లోపాలుంటే చర్యలు తప్పవు
డీఈవో అప్పారావునాయుడు
నర్సీపట్నం: విద్యా బోధనలో లోపాలుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావునాయుడు పేర్కొన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ (మెయిన్)ను పరిశీలించారు. విద్యార్థుల పఠన సామర్ధ్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు ప్రభుత్వం ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని కల్పిస్తుందన్నారు. నాడు–నేడు అసంపూర్తిగా నిలిచిన పాఠశాలల వివరాలను ప్రభుత్వానికి నివేదించామన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బోధన తీరుపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు రెండు పూటలా ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు చేయాలన్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు కానీ 21 మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.